అకాల వర్షాలతో కట్ట మైసమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో ఊర చెరువులోకి నీరు చేరింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గాయం ఉదయశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామ దేవతలను, కట్ట మైసమ్మ అమ్మవారిని దేవాలయ కమిటీ చైర్మన్ పొనుగోటి శ్రీధర్ రావు, వైస్ చైర్మన్ కోడి వీరస్వామి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, కోడిని కోసి గురువారం పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురిసి, చెరువు పూర్తిగా నిండి, గ్రామ ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్

✕
✕