సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేట పట్టణంలోని ఈనాడు కార్యాలయం, రాజీవ్ పార్క్ జమ్మిగడ్డ వద్ద పబ్లిక్ హెల్త్ ENC భాస్కర్ రెడ్డితో కలిసి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు మొరిశెట్టి నివేదిత లక్షాది పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఏలిమినేటి అభినయ్, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.