సూర్యాపేట జిల్లాకు కొత్త డీఈఓగా శ్రీనివాసరావు నియామకం

సూర్యాపేట జిల్లాకు నూతన డీఈఓ సోమవారం (ఎఫ్‌ఏసీ)గా సీహెచ్ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, గతంలో ఖమ్మం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. పదోన్నతిపై నిర్మల్ ఏ. డీగా వెళ్లిన ఆయనను, ప్రభుత్వం బదిలీపై సూర్యాపేట డీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఈఓగా ఉన్న కె. అశోక్‌ను సమగ్ర శిక్ష అభియాన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తిరిగి నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్

✕
✕