సూర్యాపేటలో పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం

సూర్యాపేట పట్టణంలో అలంకార్ బజార్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి ఓరుగంటి శ్రీచక్రసాయి (15) పాఠశాల నుంచి అదృశ్యమయ్యాడు. 60 ఫీట్ రోడ్డులోని కాకతీయ పాఠశాలలో చదువుతున్న సాయి, మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ బ్రేక్‌లో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి లక్ష్మీరామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిస్తే సీఐ వెంకటయ్య (8712686005) లేదా ఎస్ఐ నరేందర్ రెడ్డిని (9491653765) సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్