సూర్యాపేట: గంజాయి విక్రయం.. నిందితుల అరెస్ట్

ఐదుగురు వ్యక్తుల నుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో జరిగింది. డిఎస్పి వి. ప్రసన్నకుమార్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ తన పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా బొమ్మకంటి గోపి, పేరం శ్రీకాంత్, పేరం శివ, పెన్ పహాడ్ కు చెందిన ఇంద్రవెల్లి జీవన్ కుమార్, నారాయణ గూడెం గ్రామానికి చెందిన పర్సనబోయిన రమేష్ లు అనుమాన స్పదంగా బైకులపై వెళుతుండగా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్