సూర్యాపేట సిద్ధార్థ ఉన్నత పాఠశాల 1998- 99 బ్యాచ్ 10 పదవ తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి గురువులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 26 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో తమ ముందుకు రావడం, సన్మానించడం శుభ పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.