సూర్యాపేట: కాపు యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా భరత్ నాయుడు

సూర్యాపేట జిల్లాకు చెందిన దంతాల భరత్ నాయుడు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు సూచన మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నీలం రాజ కిషోర్ ఈ నియామకం చేశారు. నియామక పత్రాన్ని అందుకున్న భరత్ నాయుడు, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మున్నూరు కాపుల అభ్యున్నతికి, ఐక్యతకు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పుటం పురుషోత్తం రావు, పుట్ట కిషోర్, దంతాల రాంబాబు, చామా అశోక్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్