సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. తెలుగు, ఆంగ్ల పాఠాలు చదివించారు. గణితంలో చతుర్విధ ప్రక్రియలు, అంకెలు, సంఖ్యలు రాయించారు. సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.