సూర్యాపేటలోని 36వ వార్డు ఫరుక్ ఇంటికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జిక్కిడి శివ చరణ్ రెడ్డి రాగా.. యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫరూక్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శివ చరణ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ అభ్యర్థులకు 25% టికెట్లు ఇచ్చే విధంగా పీసీసీ ప్రెసిడెంట్ తో మాట్లాడుతానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు.