సూర్యాపేట: దీపావళి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

దీపావళి పండుగ ను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్ద చిన్నారులు పటాసులు పేల్చేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే టపాసులకు బదులు కాలుష్య రహిత టపాసులను కాల్చాలని సూచించారు. జిల్లా వాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్