సూర్యాపేట: రెచ్చిపోయిన దొంగలు.. బంగారం, నగదు చోరీ

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో బత్తిని సైదమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన సైదమ్మ సోమవారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని ఐదు తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 1,30,000 నగదు దొంగిలించబడ్డాయని తెలిపారు. సంఘటనపై సమాచారం అందుకున్న నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్, గరిడేపల్లి ఏఎస్ఐ జగన్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితురాలి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని, తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్