సూర్యాపేట: వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య

కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం శివారులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన భూక్య అసలీ (40)గా గుర్తించారు. అయితే ఇటీవల మదన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి మధ్య గొడవల కారణంగా గుండాల సహాయంతో మదన్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్