సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో విద్యుత్ ఘాతానికి గ్రామానికి చెందిన దొంతకాని నాగయ్య గురువారం మృతి చెందాడు. వ్యవసాయ భావి వద్ద ట్రాన్స్ఫారం ఆన్ చేస్తుండగా నాగయ్యకు విద్యుత్ షాక్ తగిలింది. గుర్తించిన స్థానికులు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.