మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణల ప్రకారం, BRS నేత బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసింది. చట్టాలను గౌరవించే BRS నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను వాడుకుంటున్నారని, తప్పుడు కేసులు పెడుతున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు.