సూర్యాపేట జిల్లాలో రాగల 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి, పత్తి పంటలు తీసినవారు తడవకుండా కప్పి పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ నర్సింహా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణించేవారు నెమ్మదిగా వెళ్లాలని, దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.