సూర్యాపేట: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌.. వాహ‌నాల దారి మ‌ళ్లింపు

ప్రముఖ జాతరల్లో ఒకటైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో కొలువైన దురాజ్‌పల్లిలో ఈ జాతర జరగనుంది. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం కానుండడంతో జాతీయ రహదారి 65పై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సంబంధిత పోస్ట్