సూర్యాపేటలో ఈనెల 14న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే చేయూత పించన్ దారుల జిల్లా సదస్సుకు తరలిరావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో వికలాంగుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయిన నేటి వరకు 6000 పింఛన్ హామీ అమలు కాలేదు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.