సూర్యాపేటలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె సుజాత ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఏ, బీ సెంటర్ లు, ఎస్వీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ మేధా జూనియర్ కళాశాల, శ్రీనిధి జూనియర్ కళాశాలలో జరిగే ఎనిమిది సెంటర్లను తనిఖీ చేసారు. మొత్తం 2590 హాజరు కాగా, 208మంది గైరాజరయ్యారని ఆమె తెలిపారు.