సూర్యాపేట: 'రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

జులై 14 సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో జరిగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించారు. రాష్ట్ర నలుమూలల నుండి మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటారని వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్