సకల విద్యాప్రదాయని సరస్వతీ మాత అని శ్రీ సరస్వతీ విద్యాలయం యాజమాన్య కమిటీ అధ్యక్షులు ఒంటెద్దు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మాగ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025- 26 విద్యా సంవత్సరంలో ప్రారంభ కార్యక్రమం గా చిన్నారులకు 150 మందికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సరస్వతి మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు.