ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మహిళా మృతి చెందిన ఘటన చివ్వేంల మండలం ఐలాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. తమ పొలంలో వరి కొయ్యాకాళ్ళు తగుల పెట్టడానికి కూసునోజు లావణ్య (32) తన భర్త బాలకృష్ణతో తగులుబెడుతుండగా బావి చుట్టూ పొగ కమ్ముకుంది. అది గమనించకుండా ప్రమాదవశాత్తు మహిళ బావిలో పడింది. కొంత దూరంలో ఉన్న భర్త బాలకృష్ణ గమనించి స్థానికులని పిలువగా వారు వచ్చి బయటికి తీశారు. కొంత సమయానికి ఆమె చనిపోయింది.