సూర్యాపేట: కరెంట్ షాక్‌తో యువకుడి దుర్మరణం

పెన్ పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన నిఖిల్ (17) బుధవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి తాటి ముంజలు కోయడానికి వెళ్ళాడు. ఐరన్ పైపుతో ముంజలు కోస్తున్న సమయంలో పైపు 11 కెవి హై టెన్షన్ కరెంటు వైర్ పై పడటంతో నిఖిల్ కు తీవ్ర విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నిర్లక్ష్యంపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్