తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చలో కొడంగల్ విజయవంతం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కే.కే. కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం చేవెళ్ల నుంచి కొడంగల్ వరకు సుమారు 150 కార్లతో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. కొడంగల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్