రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: జిల్లా కలెక్టర్

'రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది' అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మార్కెటింగ్, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సమర్థక శాఖల ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కూడా పాల్గొన్నారు. సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్