ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కి కృషి చేయాలి

ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పిఆర్టియు శాఖ పక్షాన నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్