అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, దరఖాస్తుకు ఎలాంటి సమయ పరిమితి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇదొక నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.