చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం స్టేజీ వద్ద శనివారం 65వ నంబరు జాతీయ రహదారిపై మూడు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో ముందున్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పల్టీ కొట్టి కారును ఢీకొనడంతో లింగోజిగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ పోలేపల్లి అంజయ్య తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.