సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గంలోని ఎల్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దె అంజయ్య గారి సతీమణి కీ'శే' మిద్దె రాములమ్మ గారి పార్థివదేహానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్కారం గ్రామ సర్పంచ్ కుంటిగొర్ల శ్రీను యాదవ్, ఉప సర్పంచ్ రెడ్డి నాగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కట్టేబోయిన మల్లయ్య, మాజీ ఎంపీటీసీ వెంకన్న, జిల్లా కాంగ్రెస్ నాయకులు మోదల గంగయ్య, మిద్దె కిరణ్, మిద్దె రమేష్, మిద్ద శ్రవణ్, రాపర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.