జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయూడబ్ల్యూజే-ఐజేయూ కృషి

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అర్ధ శతాబ్దానికి పైగా పోరాడుతున్న టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘం సూర్యాపేట జిల్లాలో సభ్యత్వ నమోదులో ముందంజలో ఉందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులకు సభ్యత్వాలు అందజేశారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇంటి స్థలాల సాధన కోసం సంఘం కృషి చేస్తుందని, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డా. కృష్ణ బంటు, రామ్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్