చివ్వెంల మండలం గుంజులూరు స్టేజి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.