సూర్యాపేట జిల్లాలో మంగళవారం వంగాల యేసురత్నం వర్ధంతిని పురస్కరించుకుని కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. సెంటర్ అధ్యక్షుడు వంగాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ, యేసురత్నం సమాజ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.