ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథులుగా హాజరై వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ధర్మం, అహింస, సమానత్వం విలువలను ఆచరించాలని సూచించారు. అధికారులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.