మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు: రామస్వామి ఫ్లెక్సీ

పాలెఅన్నారం (నారాయణపురం)లో యలగాని రామస్వామి తమ ఇంటి ముందు 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..' అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఈ చర్య తీసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేసి, తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రామస్వామి సూచించారు. సరైన అభ్యర్థిని ఎన్నుకునే పదునైన ఆయుధం ఓటు అని, దానిని దుర్వినియోగం చేయొద్దని ఆయన అన్నారు. ఈ ఫ్లెక్సీని చూసిన ప్రజలు రామస్వామిని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్