ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్రటరీ, మార్కెటింగ్ డైరెక్టర్ కే సురేంద్రమోహన్ అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో తెలుసుకోవడంతోపాటు, పథకాల అమలులో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.