ఈ సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం: మంత్రి ఉత్తమ్

యాసంగి సీజన్‌లో 90 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 16 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, సన్నరకాలకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్ల సమస్యలను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్