తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, ఎరువుల వ్యాపారులు రైతులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. యూరియా బస్తాను రూ. 470, డీఏపీ బస్తాను రూ. 1, 650కు విక్రయిస్తున్నారని, ఇది ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు మించినదని తెలిపారు. యూరియా బస్తా ధర రూ. 266. 50, డీఏపీ బస్తా ధర రూ. 1, 350 కంటే ఎక్కువకు విక్రయించడం నేరమని పేర్కొన్నారు. డీలర్లు బహిరంగంగా అధిక ధరలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.