గుడి బండ లో ఈత కు వెళ్ళి తిరిగిరాని లోకాలకు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లారెడ్డిగూడెంకు చెందిన బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి గొంగరెడ్డి సాయికుమార్ రెడ్డి (21) వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందాడు. వేసవి సెలవులకు గ్రామానికి వచ్చిన సాయికుమార్, స్నేహితులతో కలిసి బుధవారం సరదాగా ఈతకు వెళ్ళాడు. గుడిబండ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఈత కొడుతుండగా, అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సంబంధిత పోస్ట్