యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో బిక్కెరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న కృష్ణమూర్తి (48) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్న కృష్ణమూర్తి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.