మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించి, క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన అజారుద్దీన్ వంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడాన్ని బీజేపీ అడ్డుకుంటోందని ఆయన అన్నారు.