సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, బిక్కుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడవ వార్డులో దారికి అడ్డంగా ఉన్న విద్యుత్ తీగల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిని సంబంధిత అధికారులు పర్యవేక్షించి, తక్షణమే పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.