ఇతరుల హక్కులను కాపాడడం మనందరి బాధ్యత: సర్పంచ్ మంజుల సతీష్

ప్రతి మనిషికి సమాన హక్కులు, స్వేచ్ఛలు ఉండాలనే లక్ష్యంతో పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవించడంతో పాటు, ఇతరుల హక్కులను కాపాడటం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విలువలను పాటిస్తూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని, ప్రతి పౌరుడు చైతన్యవంతుడై తన హక్కులను వినియోగించుకుంటూ, బాధ్యతలను నిర్వర్తిస్తే దేశం బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్