సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎంత వరి ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు కూడా పాల్గొన్నారు.