జాజిరెడ్డిగూడెం: తిమ్మాపురం పాలకేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం పాలకేంద్రం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ ముగిసిన రెండు గంటల తర్వాత కూడా లెక్కింపు ప్రారంభించకుండా, స్థానిక సీఐ నాగేశ్వరరావు పోలింగ్ బాక్సులను అధికార పార్టీ నాయకులకు అప్పగించారని మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని ఆరోపించారు. పక్షపాతంగా వ్యవహరించిన సీఐని సస్పెండ్ చేసి, వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

సంబంధిత పోస్ట్