జాజిరెడ్డిగూడెం: మూసి ప్రాజెక్టు తాజా సమాచారం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. అధికారులు 8 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 49,791.5 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్