విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి, గ్రామంలో విషాదం

సూర్యాపేట జిల్లా అడివెంల గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో పంతం నాగరాజు (32) అనే కౌలు రైతు మృతి చెందాడు. తన అక్క, బావ వద్ద రెండేళ్లుగా వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న నాగరాజు, నాట్లు వేసే సమయంలో పంట చేతికి రావడం కష్టమవుతుందని విద్యుత్ మోటారుకు తగిలించిన తీగలను తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బురద పొలం కావడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి నిర్మళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్