సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో నేడు పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలుగుతుంది. రెడ్డిగూడెం సబేస్టేషన్ పరిధిలోని రాజానాయక్ తండా, ముకుందాపురం సబ్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం గ్రామాలకు 11కేవీ విద్యుత్ వైర్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగిం పు కారణంగా బుధవారం ఉ. 7గంటల నుంచి 11గం. వరకు విద్యుత్ సరఫరాలో అంత రాయం ఉంటుందని ఏఈ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.