సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూర్ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సర్పంచ్, వార్డు సభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో ఈసారి మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగారం మండల అధ్యక్షులు తోడిసు లింగయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.