యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని కొండగడప గ్రామ రైతులు ఎడ్లబండ్లతో వచ్చి ముట్టడించారు. బిక్కేరు వాగు నుంచి ట్రాక్టర్లకు ఇసుక తరలింపుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఎడ్ల బండ్లను తోలుకొచ్చి కార్యాలయం ముందు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడంతో తాము ఉపాధి కోల్పోతామని ఎడ్లబండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్లకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేయాలని వేడుకుంటున్నారు.