యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతుసేవా సహకార సంఘం కార్యాలయంలో ఉద్యోగులు మద్యం పార్టీ చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు కార్యాలయం తెరిచి ఉంచి, చైర్మన్ ఛాంబర్ లోనే నలుగురు ఉద్యోగులు మద్యం సేవించారు. వీరిలో మోత్కూరు సింగిల్ విండో కార్యాలయ ఉద్యోగులతో పాటు నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్ ఉద్యోగి పృధ్వి, అడ్డగూడూరు సింగిల్విండో కంప్యూటర్ ఆపరేటర్ శివ ఉన్నారు.