మోత్కూర్: అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని పనకబండ చౌరస్తా నుండి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఐ మోత్కూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, వెంకట్, అంజయ్య, మల్లేష్, ఉప్పలయ్య, యాదగిరి, వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసయ్య, సుందరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్